logo

కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా
Highlights

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు నేటి ఉదయం బయదేరారు. కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు నేటి ఉదయం బయదేరారు. కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి బయలుదేరిన కేసీఆర్.. రోడ్డు మార్గంలో వెళ్తున్న కేసీఆర్ కి నగరికి చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాతో పాటు కేసీఆర్‌కు పెద్దిరెడ్డి, మిథన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి కంచికి బయల్దేరారు. నేడు కేసీఆర్ కుటుంబ సమేతంగా కంచి అత్తివరదరాజ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన కంచికి బయలుదేరి వెళ్లారు.


లైవ్ టీవి


Share it
Top