Top
logo

Andhra Pradesh: నేను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారు.. ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నా : గంటా శ్రీనివాసరావు

Andhra Pradesh: నేను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారు.. ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నా : గంటా శ్రీనివాసరావు
X
గంటా శ్రీనివాసరావు
Highlights

విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ మారతారంటూ...

విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.

విశాఖకు రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలు ఉన్నాయని శాంతి భద్రతలపై ఉన్న అనుమానాలను ప్రభుత్వమే నివృత్తి చేయాలన్నారు. తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారన్న గంటా సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

Web TitleMLA Ganta Srinivasa Rao once again supported to Visakhapatnam as AP capital proposal
Next Story