వైసీపీ ఎమ్మెల్యేకి స్వల్ప గాయాలు

వైసీపీ ఎమ్మెల్యేకి స్వల్ప గాయాలు
x
Alla Ramakrishna Reddy (File Photo)
Highlights

వైసీపీనేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరైనా అయన వధువరులను...

వైసీపీనేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరైనా అయన వధువరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కుప్పకూలింది. ఈ క్రమంలో ఆళ్ల కింద పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆయనని పైకి లేపి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయనకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కంగారుపడ్డారు. అనంతరం ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం అయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయన ఇంటికి వెళ్లి పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories