టిక్ టాక్‌తో తప్పిపోయి.. వాట్సాప్‌తో దొరికాడు..

టిక్ టాక్‌తో తప్పిపోయి.. వాట్సాప్‌తో దొరికాడు..
x
Highlights

టిక్ టాక్ మత్తులో పడి కొందరూ ఏం చేస్తున్నారో వారికే అర్ధమవ్వడం లేదు. ఇప్పటికే చాలా మంది టిక్ టాక్ వీడియోలు చేసి ఏకంగా తమ ఉద్యోగాలు పొగొట్టుకున్న...

టిక్ టాక్ మత్తులో పడి కొందరూ ఏం చేస్తున్నారో వారికే అర్ధమవ్వడం లేదు. ఇప్పటికే చాలా మంది టిక్ టాక్ వీడియోలు చేసి ఏకంగా తమ ఉద్యోగాలు పొగొట్టుకున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. తాజాగా టిక్ టాక్ మోజు ఓ విద్యార్ధిని ప్రాణాల మీదకే తెచ్చింది. తోటి విద్యార్థులు, పోలీసులు వెంటనే స్పందించి 15గంటల తరువాత అడవిలో జల్లడపట్టి చివరకు దవఖానకు తరలించారు. పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం కలకడకు చెందిన మురళీకృష్ట చంద్రగిరి మండలంలోని విద్యానికేతన్ కాలేజీ మైక్రోబయాలజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కళాశాలకు సెలవు దినం కావడంతో ఖాళీగా కూర్చున్న మురళీ టిక్ టాక్ చెద్దామని ఆలోచన వచ్చింది.

సాధారణంగా అయితే టిక్ టాక్ చేసే వారు రూంలోనో.. లేక కళాశాలలోనో చేస్తారు. అయితే అందరిలా రోటీన్‌గా టిక్ టాక్ చేస్తే అందులో కిక్ ఏం ఉందని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ.. ఈ కుర్రోడు మాత్రం ఏకంగా దట్టమైన అడవిలోకి వెళ్లి టిక్ టాక్ చేయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఇలా అనుకున్నడో లేదో వెంటనే మురళీ శేషాచల అడవి బాట పట్టాడు. అడవిలోని ఓ ప్రాంతంలో జాతీయ జెండాను నాటి సెల్యూట్‌ చేశాడు. మరొక చోట పెద్ద కొండపైకి వెక్కి మరో టిక్‌టాక్‌ చేసి తన సెల్‌ఫోన్‌లో భద్రపరుచుకుని తిరుగు పయనమయ్యాడు. అయితే తిరుగుపయనం అయ్యే క్రమంలోనే అతగాడు వచ్చిన దారినే మరిచిపోయాడు. ఇంకేముంది అసలే దట్టమైన అడవి... అప్పటికే సాయంత్రం అయిపోయింది. తాను తెచ్చుకున్న స్నాక్స్, నీళ్ల బాటీల్స్ కూడా అయిపోయాయి.. దీంతో దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కు మంటూ సుమారు 5గంటల పాటు అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు.

ఇక లాభం లేదని తన స్నేహితులకు రాత్రి 9 గంటలకు ఫోన్‌ చేసి వాట్సప్‌లో లోకేషన్‌ షేర్‌ చేశాడు. వెంటనే తోటి విద్యార్థులు స్పందించి హాస్టల్‌ యాజమాన్యంతో పాటు చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సీఐ రామచంద్రారెడ్డి ప్రత్యేక బృందాన్ని అడవిలోకి పంపించాడు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా మురళీకృష్ణ ఆచూకీ కోసం దాదాపు నాలుగు గంటల పాటు పోలీసులు శ్రమించి.. చివరకు సోమవారం తెల్లవారుజామున 3 గంటలప్రాంతంలో శ్రీవారిమెట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో స్పృహ తప్పిపోయిన స్థితిలో ఉన్న మురళీకృష్ణను పోలీసులు గుర్తిం చారు. వెంటనే పోలీసులు మురళీని భుజాలపై 5 కిలోమీటర్లు మోసుకొచ్చి 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. దీంతో ప్రాణ పాయం నుంచి తప్పించుకున్నాడు. ఇటీవల కాలంలో టిక్‌టాక్‌ పిచ్చితో చాలామంది యువత తమ ప్రాణాలు పోగుట్టుకున్నారు. ఇంక మరికొందరు ఉద్యోగులు ఆఫీసుల్లోనే టిక్ టాక్ వీడియోలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికైన ఈ టిక్ టాక్ మహామ్మారి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిందని పలువురు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories