Andhra Pradesh: మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు..మాజీ మంత్రి యనమల

Andhra Pradesh: మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు..మాజీ మంత్రి యనమల
x
Highlights

శాసన మండలిలో జరిగిన పరిణామాలు గతంలో ఎప్పుడూ జరగలేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు...

శాసన మండలిలో జరిగిన పరిణామాలు గతంలో ఎప్పుడూ జరగలేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు యధాతథంగా.. నిన్న కౌన్సిల్ లో జరిగిన పరిణామాలు కలిచివేశాయి. 6సార్లు అసెంబ్లీ, 2సార్లు కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నాను. విధ్వంసం చేస్తామనే మాట నేను అనలేదు. కావాలంటే రికార్డులు చూసుకోండి. విధ్వంసాలు, విచ్ఛిన్నాల పేటెంట్ వైసిపిదే. దాడులు, దౌర్జన్యాలు వైసిపి నిత్యకృత్యాలు. మేము తల్చుకుంటే తోలు తీస్తాం అని మంత్రులే అన్నారు. ఎవరి తోలు ఎవరు తీస్తారు..?

మంత్రులే ద్రవ్య వినిమయ బిల్లుకు అడ్డం పడటం ఎక్కడైనా ఉందా..? ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని ప్రతిపక్షం 3గంటల పాటు అడగటం, అధికార పార్టీ తిరస్కరించడం 70ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో లేదు. అప్రాప్రియేట్ బిల్లుకన్నా ఆ 2బిల్లులే వైసిపికి ప్రాధాన్యం. రాజధాని తరలింపు అంశం లెజిస్లేచర్ ప్రాసెస్ లో ఉందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. సెలెక్ట్ కమిటి వద్ద ఉందని అటార్నీ జనరల్ హైకోర్టుకు అఫిడవిట్ లో చెప్పారు. హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ వైసిపి దృష్టిలో చెత్తకాగితమా..? ఇది కోర్టు ధిక్కరణ కాదా..? ఇప్పటికే అనేక ధిక్కరణలు..కోర్టు ధిక్కరణల్లో కూడా వైసిపిదే రికార్డు అని విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories