కోడెల ఆత్మహత్య కేసులో చంద్రబాబును కూడా విచారించాలి : మంత్రి కొడాలి

కోడెల ఆత్మహత్య కేసులో చంద్రబాబును కూడా విచారించాలి : మంత్రి కొడాలి
x
Highlights

కోడెల ఆత్మహత్య కేసులో ఏ 1 నిందితుడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును చేర్చాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ...

కోడెల ఆత్మహత్య కేసులో ఏ 1 నిందితుడిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును చేర్చాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్డేటాను విచారించాలి. ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి' అని అన్నారు. కుటుంబంతో పాటు చంద్రబాబు కూడా పక్కన పెట్టడం వల్లే కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకున్నారని నాని తెలిపారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా వేధించారని ఆరోపించారు. నరసరావుపేట నుంచి కోడెలను సత్తెనపల్లికి ఎవరు పంపించారని ప్రశ్నించిన నాని మంత్రి పదవి అడిగితే స్పీకర్ పదవి ఇచ్చారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories