Minister Dharmana Comments on Nara Lokesh : లోకేష్ కు మంత్రి ధర్మాన సవాల్.. నిరూపిస్తే..

Minister Dharmana Comments on Nara Lokesh : లోకేష్ కు మంత్రి ధర్మాన సవాల్.. నిరూపిస్తే..
x
Highlights

Minister Dharmana Krishna Das Comments on Nara Lokesh: నారా లోకేష్ పై మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే మేము చేసిన అవినీతి...

Minister Dharmana Krishna Das Comments on Nara Lokesh: నారా లోకేష్ పై మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే మేము చేసిన అవినీతి వెలికితీసి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడు లోకేష్ కు మంత్రి ధర్మాన సవాల్ విసిరారు. మంగళగిరి సీట్ గెలవలేని, మరో జన్మ ఎత్తినా ఎమ్మెల్యేగా నువు గెలవవని ఎద్దేవా చేసారు. అచ్చెన్నాయుడు తో మొదలైందని, వడ్డీతో సహా అసలూ కక్కిస్తాం అని ఆయన అన్నారు. తప్పు చేసిన మీ నేతలందరి నుంచి అసలూ, వడ్డీ కక్కిస్తాం అని సవాల్ విసిరారు. మేము అవినీతికి పాల్పడుతున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నానని తనపై ఆరోపనలు చేస్తున్నారన్నారు. తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు నుంచి తప్పుకుంటానని తెలిపారు.

ఫైబర్ గ్రిడ్ కి ఐటీ మంత్రికి సంబంధం లేదని గుమ్మడికాయ దొంగలా లోకేష్ మాట్లాడుతున్నాడన్నారు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన డాక్టర్ సుధాకర్, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప ,కూనరవి అధికారులపై చేసిన దౌర్జన్యం నీకు తెలీదా ? అని ప్రశ్నించారు. నీ తండ్రి చంద్రబాబు చేసిన తప్పులు, అక్రమాలు మేము చేయలేము అని అన్నారు. మమ్మల్ని ఎదురోకోనేందుకు మీకు అవకాశం లేదని స్పష్టం చేసారు. అందుకే రాజకీయ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేధించాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories