బాబు ఇంటిని కూల్చేస్తామన్న మంత్రి

బాబు ఇంటిని కూల్చేస్తామన్న మంత్రి
x
Highlights

ఉండవల్లి కరకట్టపై అక్రమ కట్టడాలు కూల్చివేతను సీఆర్‌డీఏ అధికారులు ప్రారంభించారు. నదికి ఆనుకుని పాతూరి కోటేశ్వరరావు కట్టిన ర్యాఫ్ట్‌ను...

ఉండవల్లి కరకట్టపై అక్రమ కట్టడాలు కూల్చివేతను సీఆర్‌డీఏ అధికారులు ప్రారంభించారు. నదికి ఆనుకుని పాతూరి కోటేశ్వరరావు కట్టిన ర్యాఫ్ట్‌ను కూల్చివేస్తున్నారు. అయితే వ్యవసాయ భూమి కోతకు గురికాకుండా నిర్మించామని పాతూరి కోటేశ్వరరావు అన్నారు. అక్రమ కట్టడాలపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసించడం మంచిది కాదన్నారు. వారం రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చామని తొలగించకపోతే ప్రభుత్వమే తొలగిస్తుందని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌ అక్రమ కట్టడమేనని, చంద్రబాబు కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారని బొత్స గుర్తు చేశారు. రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా ఆ రోజు ఈ భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు అంగీకరించారని, కానీ, ఇప్పుడేమో దానిపై మాట మారుస్తున్నారని బొత్స తప్పుబట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories