ఏపీ గవర్నర్ ముందు మెర్సీ కిల్లింగ్ వినతి

ఏపీ గవర్నర్ ముందు మెర్సీ కిల్లింగ్ వినతి
x
Highlights

ఆ తల్లి కన్న కూతురు పడుతున్న బాధను చూడలేకపోయింది వైద్యం అందించి రోగులకు అండగా నిలవాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం భరించలేకపోయింది. చేసేది ఏమీలేక కన్నకూతురిని చంపేయాలని గవర్నర్‌కు వినతి ఇచ్చింది. విజయవాడలో మెర్సీ కిల్లింగ్ వినతి సంచలనంగా మారింది. స్వర్ణలత అనే మహిళ గైనిక్ పరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న తన కూతురు జాహ్నవిని చంపేయాలని కోరింది.

జాహ్నవి 2వేలు సంవత్సరంలో జన్మించింది. ఆమె తండ్రి ప్రభుత్వాసుపత్రులో చిరు ఉద్యోగి. అయితే జాహ్నవికి నాలుగేళ్లకే మానసిక వ్యాధి నిర్ధారనైంది అనంతరం ఎనిమిదేళ్లకే జాహ్నవికి గైనిక్ పరమైన ఆరోగ్య సమస్య వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగంలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో 2017 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ హెచ్ఓడిగా రాజలక్ష్మి నియమితులయ్యారు. అయితే ఆమె జాహ్నవికి వైద్యం చేసేందుకు నిరాకరించారు. కోర్టునుంచి ఉత్తర్వులు తెచ్చినా డాక్టర్ పట్టించుకోక పోవడంతో విసిగిపోయిన ఆ మాతృమూర్తి తన కూతురిని మెర్సీ కిల్లింగ్ ద్వారా చంపాలని గవర్నర్ కు వినతి పెట్టుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories