నేడే పెట్టుబడుల సదస్సు..

నేడే పెట్టుబడుల సదస్సు..
x
Highlights

విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. పలు కీలక రంగాల్లో...

విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని సీఎం జగన్ నిర‌్ణయించారు. ఈ మేరకు సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించనున్నారు. మధ్యాహ‍్న భోజన విరామం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పలువురు రాయబారులు, కాన్సులేట్‌ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories