జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 454 కోట్లు

కడప జిల్లా పులివెందులలో వైయస్సార్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు.

S. Srikanth
Published on: 20 Dec 2019 4:05 PM IST
జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 454 కోట్లు
X

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో వైయస్సార్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం 347 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

పులివెందులలో ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ ఆసుపత్రిని 300 పడకలతో హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ గా మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పులివెందులలో జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం పది కోట్లు మంజూరు చేస్తూ జారీ చేశారు. ఈ సెంటర్ ఏర్పాటుకు పరిపాలనా పరమైన ఆమోద ఉత్తర్వులను వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి జారీ చేశారు.

S. Srikanth

S. Srikanth

Next Story