విచ్చలవిడిగా కాపీ కొడుతున్న విద్యార్థులు

విచ్చలవిడిగా కాపీ కొడుతున్న విద్యార్థులు
x
Highlights

ఫెండ్లీ పోలీస్ గురించి మనందికీ తెలుసు మరి ఫెండ్లీ టీచర్స్ గురించి మీకు తెలుసా తెలియక పోతే ఇప్పుడు మేము చెప్పే న్యూస్ ఫాలో అవండి. చివరికి మీకో క్లారటీ...

ఫెండ్లీ పోలీస్ గురించి మనందికీ తెలుసు మరి ఫెండ్లీ టీచర్స్ గురించి మీకు తెలుసా తెలియక పోతే ఇప్పుడు మేము చెప్పే న్యూస్ ఫాలో అవండి. చివరికి మీకో క్లారటీ వస్తుంది. పరీక్షను ఇంత సులువుగా రాయొచ్చా అనే భావం మీకు కలుగుతుంది.

పరీక్షలు వస్తున్నాయంటే కష్టపడి చదవాలి చదవినది గుర్తుపెట్టుకొని రాయాలి ఆ తర్వాత రిజల్డ్ ఏమవుతుందో అని టెన్షన్ గా ఎదురు చూడాలి కానీ ఆ కాలేజీలో విద్యార్థులకు ఇంత కష్టాలు లేవు నోటు ఇస్తే చాలు కాపీ కొట్టేందుకు అనుమతి వస్తుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ అయితే రోల్ నెంబర్ తో పని లేకుండా ఎక్కడైనా కూర్చొని ఎగ్జామ్ రాసే అనుమతి వస్తుంది వీలైతే టీ,కాఫీ కూడా అందించినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వారు ఫ్రెండ్లీ టీచర్స్ కాకపోతే దీనికి కాస్త ఖర్చు మాత్రం అవుతుంది.

ఇది విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జ్యోతి ఐటీఐ కళాశాల విద్యార్థుల నుంచి యాజమాన్యం వేల రూపాయలు వసూలు చేసి మాస్ కాపీయింగ్ కి అనుమతిచ్చారు. ఇంకేముంది విద్యార్థులందరూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ విచ్చల విడిగా మాస్ కాపీయింగ్ కి పాల్పడ్డారు. ఇన్విజిలేషన్ కోసం వచ్చిన టీచర్లు కూడా వారికి సహకరించారు. ఈ మొత్తం వ్యవహారం హెచ్చఎంటీవీ కెమారాకు చిక్కింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories