logo

చంద్రబాబు గారు కొత్త ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోండి ..! ఇల్లు ఇస్తాం

చంద్రబాబు గారు కొత్త ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోండి ..! ఇల్లు ఇస్తాం
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ముంపుకు గురవుతుందని అందువల్ల దీనికోసమే...

ఏపీ ప్రతిపక్ష నేత మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ముంపుకు గురవుతుందని అందువల్ల దీనికోసమే డ్రోన్లతో ఫోటోలు, వీడియోలు తీసామని ఏపీ జలవనరుల శాఖా చెప్పుకొచ్చింది . అయితే దీనిపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు . అంతేకాకుండా టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు . మాజీ మంత్రి దేవినేని ఉమ ఈరోజు కావాలనే కృత్రిమ వరదను ప్రభుత్వం సృష్టించిందని , ముందస్తు చర్యలు తీసుకుంటే ముంపు సమస్య వుండేది కాదని వ్యాఖ్యానించారు. కావాలనే చంద్రబాబు ఇంటిని ముంపుకి గురిచేసారని అయన వాఖ్యానించారు . అయితే ఈ వాఖ్యాలపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి ఫైర్ అయ్యారు .

ఉమ వాఖ్యాలను ఉద్దేశిస్తూ టీడీపీ నేతలు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుందని అని అన్నారు . ప్రపంచ స్థాయిలో రాజధానిని కడతానని చెప్పిన చంద్రబాబు కనీసం రాజధానిలో సెంటు భూమి అయిన కొన్నారా అని ప్రశ్నించారు . చంద్రబాబుది అక్రమ నివాసమేనని, ముందే వరద వస్తుందని తెలిసి అయన హైదరాబాద్ పారిపోయరని, ఆయన నివాసంలోని వాహనాలను హ్యాపీ రిసార్ట్స్ కు, ఫర్నీచర్ ను ఇంటిలోని మొదటి ఫ్లోర్ కు తరలించారని ఎద్దేవా చేశారు. వచ్చే ఉగాది నుండి జగన్ ప్రభుత్వం ఇల్లు లేనివారికి నివాసం కలిపిస్తుందని దానికి దరఖాస్తు చేసుకోవాలని అయన వ్యంగాస్త్రాలు సంధించారు ..మీ దగ్గరికి మా వాలంటీర్ వచ్చి సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తాడని వాఖ్యలు చేసారు రామకృష్ణా రెడ్డి


లైవ్ టీవి


Share it
Top