ఊరునే తాకట్టు పెట్టేశాడు..!

ఊరునే తాకట్టు పెట్టేశాడు..!
x
Highlights

బంగారం తాకట్టు పెడతారు స్థలాలు తాకట్టు పెడతారు అయితే ఓ ప్రబుద్ధడు గ్రామస్తులకే తెలియకుండా ఊరునే తాకట్టు పెట్టేశాడు. ఏళ్ల తరబడి నివాసం ఉన్న గ్రామాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు.

బంగారం తాకట్టు పెడతారు స్థలాలు తాకట్టు పెడతారు అయితే ఓ ప్రబుద్ధడు గ్రామస్తులకే తెలియకుండా ఊరునే తాకట్టు పెట్టేశాడు. ఏళ్ల తరబడి నివాసం ఉన్న గ్రామాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాంకుల్లో టోకరా వేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘరానా మోసం గురించి తెలసుకోవాలంటే అక్కడకు వెళ్లాల్సిందే.

చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం ఆరె పంచాయతీ పరిధిలో ఉంది ఈ చిన్న గ్రామం జ్ఞానమ్మకండ్రిగ. ఇక్కడి వారంత చిన్న చిన్న పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ఊరంతా తనదేనని హరి అనే వ్యక్తి ఏకంగా తనఖా పెట్టేశాడు.

సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ నివాసాలున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న ఆ ఊరు చాలా మంది స్థల దాతల సహకారంతో ఓ గ్రామంగా ఏర్పాటైంది. సీసీ రహదారులు, వీధి దీపాలు అన్నీ వచ్చాయి. రేషన్ బియ్యం, ప్రభుత్వ ఫించన్లు పొందుతున్నారు. ఇంటి నెంబర్ల ఆధారంగా అందరికీ రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నా రెవెన్యూ సిబ్బంది సహకారంతో నివాసాలున్న ప్రాంతాలన్నంతా పట్టాదారు పాసుపుస్తకం చేసుకున్నాడు హరి. పలు బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రుణాలు పొందాడు.

ఒకటి కాదు, రెండు కాదు ఏకండా మూడు బ్యాంకుల్లో ముచ్చటగా మూడు లోన్లు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ సమస్యను సైతం చెప్పుకోలేని పరిస్థితిలో వీరున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మండల స్థాయి, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు అవాక్కవుతున్నారు. గ్రామ రెవెన్యూ సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories