మద్యం ప్రియుడి సంతోషం: మద్యం దుకాణానికి కొబ్బరికాయ, హారతి

మద్యం ప్రియుడి సంతోషం: మద్యం దుకాణానికి కొబ్బరికాయ, హారతి
x
Highlights

దేశంలో కరోనా వైరస్ మొదలవ్వడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.

దేశంలో కరోనా వైరస్ మొదలవ్వడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దీనితో మందుబాబుల కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళ భాధలు అన్ని ఇన్ని కావు. మార్చి 22 నుంచి మద్యం షాపులు పూర్తిగా బంద్ కావడంతో మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మద్యం దోరకక చనిపోయిన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ని మే 17 వరకు పొడిగిస్తూ లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు.. మే 3 తరువాత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులను ఓపెన్ చేసుకోవచ్చవంటూ ప్రకటించింది.

దీనితో మందుబాబుల కష్టాలు గట్టేక్కినట్టు అయింది. రేపటి(సోమవారం)నుంచి మద్యం షాపులు ఓపెన్ అవుతుడడంతో మందుబాబులు తెగ సంబరపడిపోతున్నారు. దాదాపుగా 45 రోజులుగా మద్యం లేక అల్లాడిపోయిన వారి మొహాల్లో కోటికాంతులు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే కుప్పం సరిహద్దు ప్రాంతం కర్నాటకలోని బంగారుపేట వద్ద ఓ మద్యం ప్రియుడు వైన్ షాపుకి కొబ్బరికాయ కొట్టి హారతులిచ్చాడు. ఇది చూసిన జనాలు షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక మద్యం దుకాణాల వద్ద పలు నియమాలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే..

మద్యం దుకాణాల వద్ద ఆరడుగుల దూరం పాటించాలి.

♦ ప్రతి మనిషి, మనిషికి మధ్య 2 గజాలు దూరంగా ఉండాలి.

♦ వైన్ షాపుల వద్దకి ఒక్కసారి అయిదుగురికి మాత్రమే పర్మిషన్.

♦ అటు లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో మధ్యం, పాన్, గుట్కా, పొగాకు బహిరంగ ప్రదేశాలలో వినియోగించరాదు.

♦ ఎవరైనా చర్యలను పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అందుబాటులో లేక ఇబ్బందులు పడిన మందుబాబులకి పలు నిబంధనలతో మద్యం దుకాణాలను ఓపెన్ చేయడం కొంచెం ఉరటను ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories