హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు: ఎల్వీ సుబ్రమణ్యం

హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు: ఎల్వీ సుబ్రమణ్యం
x
Highlights

తెలిసి చేసినా, తెలియక చేసినా, హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎస్ హెచ్చరించారు.

తెలిసి చేసినా, తెలియక చేసినా, హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎస్ హెచ్చరించారు. తిరుమల ఆర్టీసీ టికెట్లలో అన్యమత ప్రచారంపై విచారణ జరుగుతోందన్న ఎల్వీ సుబ్రమణ్యం.. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఎండోమెంట్ ఉద్యోగుల ఇళ్లల్లో అవసరమైతే తనిఖీలు చేస్తామంటూ సీఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హెచ్చరించారు. తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణకు ఆదేశించామన్న సీఎస్‌ త్వరలోనే సీఎం జగన్‌కు నివేదిక అందజేస్తామన్నారు.హిందూ ఆలయాల్లో అన్యమతస్థులు ఉంటే చర్యలు తప్పవని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హెచ్చరించారు. భక్తుల మనోభావాలు కాపాడేందుకు అవసరమైతే అధికారులు, ఉద్యోగుల గృహాల్లో ఆకస్మిత తనిఖీలు కూడా నిర్వహిస్తామన్నారు. ఇదిలాఉంటే, తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం ఘటనలో నెల్లూరు ఆర్టీసీ స్టోర్స్ విభాగం కంట్రోలర్ జగదీశ్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories