కిందకు దిగు నీ లగ్గం నేను చేస్తా.. ప్రేమికుడికి ఎమ్మెల్యే హామీ!

కిందకు దిగు నీ లగ్గం నేను చేస్తా.. ప్రేమికుడికి ఎమ్మెల్యే హామీ!
x
Highlights

ఎమ్మెల్యేలంటే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాదు.. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఓ ఫ్యామిలీ మెంబర్‌లా ఎంటర్ కావాల్సిందే. కొత్త ట్రెండ్ ఇప్పుడు రన్ అవుతోంది.

ఎమ్మెల్యేలంటే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాదు.. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఓ ఫ్యామిలీ మెంబర్‌లా ఎంటర్ కావాల్సిందే. కొత్త ట్రెండ్ ఇప్పుడు రన్ అవుతోంది. ప్రేమ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుని పెళ్లిళ్లు దగ్గరుండి జరిపించాల్సిందే. ఏంటీ ఎఫ్‌2 సినిమా స్టోరీ చెబుతున్నాననుకుంటున్నారా..? ఇది నిజమే. చిత్తూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యేకి అలాంటి పరిస్థితే ఎదురైంది.

చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ వ్యవహారానికి సాక్షిగా ఎమ్మెల్యే ఒకరు సాక్షిగా మరాల్సి వచ్చింది. చిత్తూరు నగరంలోని వళ్లియప్పనగర్‌కు చెందిన సంపత్ అనే యువకుడు తవణంపల్లెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో కులాంతర వివాహానికి పెద్దలు నిరాకరించారు. ఆ యువతికి వేరొకరితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. అంతే.. తన సమస్యను ఎవరికి చెప్పుకున్నా పరిష్కారం కాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి చస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళన చెందారు.

అయితే, ఆ యువకుడు అక్కడి వారికి కండిషన్ ఏంటో తెలుసా..? ఎవరొచ్చినా రాకున్నా తమ ఎమ్మెల్యే వచ్చి ఆ యువతితో పెళ్లి జరిపిస్తానని హామీ ఇస్తేనే కిందికి దిగుతానని ఓ లేఖను కిందికి పంపాడు. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏడ్చి గగ్గోలు పెట్టినా, పోలీసులు ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా ఏమాత్రం ఆ యువకుడు పట్టించుకోలేదు. ఆఖరికి ఆ యువకుడు కోరినట్టు ఎమ్మెల్యేనే సీన్‌లోకి రావాల్సి వచ్చింది.

ఆ ప్రేమికులిద్దరూ పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో పెళ్లి బాధ్యతలు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు తీసుకోక తప్పలేదు. యువతి అంగీకారం తెలుసుకుని పెళ్లి చేయిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో ఆ ప్రేమికుడి కథ సుఖాంతమైంది. మరి ఎమ్మెల్యే ఈ ప్రేమికుడికి ఇచ్చిన హామీ నెరవేరుతుందా..? లేక ఎన్నికల హామీల్లో మాదిరికి కలిసిపోతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories