దిమ్మతిరిగిపోతున్న నిమ్మధరలు..రికార్డ్‌ స్ధాయి పలుకుతున్న..

దిమ్మతిరిగిపోతున్న నిమ్మధరలు..రికార్డ్‌ స్ధాయి పలుకుతున్న..
x
Highlights

నిమ్మధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. కొనాలంటేనే గుండె గుబేలుమంటోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మార్కెట్‌లో మూడు రేట్లు...

నిమ్మధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. కొనాలంటేనే గుండె గుబేలుమంటోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మార్కెట్‌లో మూడు రేట్లు పెరగడంతో కొనేందుకు జంకుతున్నారు. కొండెక్కిన నిమ్మధరలపై స్పెషల్‌ స్టోరీ

ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆకాశాన్నంటే నిత్యావసర సరుకుల ధరలు ఓ వైపు కొనకముందే కంటతడి పెట్టిస్తూ మండుతున్న కూరగాయల ధరలు మరోవైపు సామాన్యుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కరవు ప్రభావంతో నిమ్మ సాగు తగ్గడంతో మార్కెట్ లో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

నిన్నమొన్నటి వరకు ఉల్లి కన్నీరు పెట్టిస్తే ఇప్పుడు అదే రూట్‌కి నిమ్మధరలు చేరాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా నిమ్మతోటలు ఎండిపోవడంతో సాగు తక్కువై ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. దీంతో మార్కెట్‌లో నిమ్మధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఎప్పుడు లేనంతగా సరికొత్త రికార్డ్‌ పలుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక్కసారిగా పెరిగిన నిమ్మ ధరలతో లూజు బస్తా ధర 13 నుంచి 15 వేలకు చేరింది.

నిమ్మసాగుకు కేరాఫ్‌ అడ్రస్‌ నెల్లూరు జిల్లా. జిల్లాలో మొత్తం 50 వేల ఎకరాల్లో నిమ్మ సాగు జరుగుతుంది. గూడూరు సైదాపురం, రాపూరు, బాలాయపల్లి ,డక్కిలి , వెంకటగిరి, మనుబోలు, చిల్లకురు తదితర మండలాల్లో నిమ్మ సాగు ఎక్కువగా ఉంటుంది . ఇక్కడ సాగయ్యే నిమ్మకాయలను చెన్నై, కోల్ కతా, బెంగుళూరులతో పాటు తిరుపతి, నెల్లూరు, విజయవాడ నగారాలకు తరలిస్తుంటారు. అతిపెద్ద నిమ్మ మార్కెట్ గూడురులో ఉండటంతో జిల్లాలోని నిమ్మ రైతులు ఇక్కడే పంటను అమ్ముతారు. నిమ్మ మార్కెట్ ఏర్పడి కొన్నేళ్లు అవుతున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్‌స్థాయిలో ధర నమోదు కావడంతో రైతులకు దిగుబడి లేక నిమ్మ మార్కెట్లకు సరుకు రాకపోవడంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి .

రైతులు ఓ పక్క సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఎండుతున్న నిమ్మ చెట్లు కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. మొత్తం మీద ఇన్నాళ్లూ నష్టాలతో కాలం వెళ్లదీసిన నిమ్మ సాగు అన్నదాతలు దిగుబడి తగ్గడంతో వచ్చిన కొద్ది పాటి పంటకు మంచి ధర వస్తుందంటున్నారు. వినియోగదారులు మాత్రం నిత్యం ఉపయోగించే నిమ్మ ధరలు ఆకాశాన్నంటడంతో కొనేందుకు జంకుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories