logo

కృష్ణా జిల్లాలో మళ్లీ మొదలైన పాము కాట్లు

కృష్ణా జిల్లాలో మళ్లీ మొదలైన పాము కాట్లు
Highlights

కృష్ణా జిల్లాలో పాము కాట్లు మళ్లీ మొదలయ్యాయి. దివిసీమలో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు విషసర్పాలు బయటకు...

కృష్ణా జిల్లాలో పాము కాట్లు మళ్లీ మొదలయ్యాయి. దివిసీమలో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు విషసర్పాలు బయటకు వచ్చాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక్క రోజునే ఏడుగురు పాముకాటుకు గురయ్యారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల సీతామహాలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పాము కాటుకు సంబంధించి ఇంజెక్షన్లు సిద్దం చేశామని ప్రజలు ఎవరూ కంగారు పడవద్దని వైద్యులు చెబుతున్నారు. పాము కరచిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పాముకాటు విరుగుడుకు వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు. నాటు వైద్యం నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.

లైవ్ టీవి

Share it
Top