'జగన్‌ సాక్షిగా..' అంటూ ఎమ్మెల్యే ప్రమాణం..రెండోసారి..

జగన్‌ సాక్షిగా.. అంటూ ఎమ్మెల్యే ప్రమాణం..రెండోసారి..
x
Highlights

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డి, తమ పార్టీ అధినేతపై స్వామిభక్తిని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని...

నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డి, తమ పార్టీ అధినేతపై స్వామిభక్తిని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారో లేక ఆయన దృష్టిలో పడాలనుకున్నారో తెలియదు గానీ, ఓ రేంజ్‌లో తన భక్తిని చాటుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తూ నా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు.

నా ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సాక్షిగా అంటూ నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డి ప్రమాణం చేయడంతో ప్రొటెం స్పీకర్ మరోసారి ప్రమాణం చేయించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ అండ్ రూల్స్‌ ప్రకారం దైవసాక్షిగా, మనస్సాక్షిగా అంటూ ప్రమాణం చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కోటంరెడ్డి ప్రమాణం చేయడంతో చెల్లదని తేల్చారు. దాంతో మరోసారి కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories