Top
logo

ఆ అర్హత లోకేష్‌కు లేదు: కిల్లి కృపారాణి

ఆ అర్హత లోకేష్‌కు లేదు: కిల్లి కృపారాణి
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ట్వీట్లు చేయడం బాధాకరమని వైసీపీ నేత కిల్లి కృపారాణి అన్నారు. సీఎం జగన్‌ను రాజీనామా చేయాలని అడిగే అర్హత నారా లోకేష్‌కు లేదని కిల్లీ కృపారాణి చెప్పారు. మాట మార్చడం, మడమ తిప్పడం నారా లోకేశ్ తండ్రి అయినా నారా చంద్రబాబు నాయుడుకే అలవాటని విమర్శించారు. విభజన హామీలపై వైసీపీ మొదటినుంచి పోరాటం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ పై ఆమె విమర్శలు చేశారు. కేంద్రబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు.


లైవ్ టీవి


Share it
Top