కేశినేని వర్సెస్ బుద్ధాల వార్.. ఫుల్ స్టాప్ కోసం తెలుగు తమ్ముళ్లు..

కేశినేని వర్సెస్ బుద్ధాల వార్.. ఫుల్ స్టాప్ కోసం తెలుగు తమ్ముళ్లు..
x
Highlights

టీడీపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గ బేధాలుమరోసారి బయటపడ్డాయి. ట్విటర్ వేదికగా లీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే విమర్శల...

టీడీపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గ బేధాలుమరోసారి బయటపడ్డాయి. ట్విటర్ వేదికగా లీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరోకరు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన విజయవాడఎంపీ కేశినేని నాని రీసెంట్ గా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.

కేశినేని నాని బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. నాలుగు ఓట్లు రాని వాడు నాలుగు పదవులు సంపాదించాడని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను విమర్శించారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన వెంకన్న సంక్షోభంలో టీడీపీకి పార్టీని కాపాడేవాడు కావాలనీ, నీలా కూల్చేసేవాడు కాదని కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఆ వ్యాఖ్యలపై కేశినేని నాని మరోసారి తీవ్రంగా స్పందించారు. కొందరు నిన్నటి దాకా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారనీ, రేపటి నుంచి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఇద్దరివీ కాళ్లు మాత్రమేననీ, వ్యక్తులు మాత్రమే తేడా అని కేశినేని నాని మరో ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన బుద్దా వెంకన్న కేశినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని ఆ పార్టీని కూల్చావు చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు.. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు అని కేశినేనిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ ట్విట్ మీద స్పందించిన కేశనేని రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుల్లో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవీదారులకి అవసరమని నాకు అవసరం లేదని ట్విట్టర్ లో కేశినేని నాని అన్నారు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ ముదురుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు స్పందించి ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories