కేశినేని నాని మరో ట్వీట్.. ఈసారి నేరుగా చంద్రబాబుకే..

కేశినేని నాని మరో ట్వీట్.. ఈసారి నేరుగా చంద్రబాబుకే..
x
Highlights

టీడీపీలో ట్వీట్ వార్ ముదురుతోంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని నేరుగా చంద్రబాబుకే ట్వీట్ చేశారు. తన లాంటి వారు టీడీపీలో ఉండటానికి ఇష్టం లేకపోతే...

టీడీపీలో ట్వీట్ వార్ ముదురుతోంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని నేరుగా చంద్రబాబుకే ట్వీట్ చేశారు. తన లాంటి వారు టీడీపీలో ఉండటానికి ఇష్టం లేకపోతే ఎంపీ స్థానానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. అలాగే మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండని తీవ్ర స్థాయిలో ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. బెజవాడ టీడీపీలో ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. అయితే నిన్నటి వరకు అంతర్గతంగా సాగిన పోరు నేడు బహిరంగ పోరాటంగా మారింది. ఈ నేపథ్యంలో నాని ఏకంగా చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు దీనిపై పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories