కూల్చివేయాల్సిందే..అపార్ట్ మెంట్ నివాసయోగ్యం కాదని తేల్చిన నిపుణులు

కూల్చివేయాల్సిందే..అపార్ట్ మెంట్ నివాసయోగ్యం కాదని తేల్చిన నిపుణులు
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం నివాస యోగ్యం కాదని తేల్చారు నిపుణులు. మరమ్మత్తులతో ఉపయోగం లేదని కుంగిన అపార్ట్ మెంట్...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం నివాస యోగ్యం కాదని తేల్చారు నిపుణులు. మరమ్మత్తులతో ఉపయోగం లేదని కుంగిన అపార్ట్ మెంట్ కూల్చివేయక తప్పదని అంటున్నారు. అయితే ఏ పద్దతిలో కూల్చి వేయాలనే విషయంపై నిపుణులు సమాలోచనలను చేస్తున్నారు. జేసీబీలోతో కూల్చివేయాలా లేక ఇతర ఆధునిక సాంకేతిత పద్దతులు ఎవైనా వినియోగించాలా అన్నది యోచిస్తున్నారు.

కాకినాడ నగరంలో కుంగిపోయిన ఐదంతస్తు భవనం నివాస యోగం కాదని తేల్చింది ఇంజినీరింగ్ నిపుణుల బృందం. మల్టీఫ్లెక్స్ సినీ థియేటర్ కూడలిలోని అపార్ట్ మెంట్ పిల్లర్లు శిథిలమయ్యాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో క్షణక్షణం భయంభయంగా ఉంది. రెవెన్యూ, నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు భవనాన్ని పరిశీలించారు. భవనం చాలా ప్రమాదకరంగా ఉందని భవన నిర్మాణంలో వాడిన మెటీరియల్ నాసీరకంగా ఉందని జేఎన్టీయూ నిపుణులు వెల్లడించారు.

2005లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 ప్లాట్లు ఉన్నాయి. నివాసాలతో పాటు పలు కార్యాలయాలు ఈ భవనంలో ఉన్నాయి. భవనం వెనుకభాగంలో ఉన్న పిల్లర్లు అన్ని పగుళ్లు రావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అపార్ట్ మెంట్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అపార్ట్ మెంట్ కు తాళాలు వేశారు. మూడు రోజుల్ల భవనం కూల్చి వేయాలని నోటీసులు జారీ చేశారు. ముందుజాగ్రత్తగా అపార్ట్ మెంట్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వారిని కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతుండటంతో అపార్టుమెంట్‌ వాసులు బోరు మంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories