టీడీపీ మునిగిపోతున్న నావ.. జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ మునిగిపోతున్న నావ.. జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్‌,...

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ కాషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి చేరికతో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం అయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ యాత్రలో ఉన్న సమయంలో తలెత్తిన ఈ సంక్షోభం పార్టీని ఎక్కడికి తీసుకెళుతుందోనని పార్టీ అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావే అయినటప్పటికి తాను మాత్రం టీడీపీ పార్టీని వీడబోనని స్సష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ బలోపేతం అవుతుందో, లేదో ఇప్పుడే చెప్పలేమని, దానికి మరో ఏడాది గడువు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితనం గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం అని, మరో ఆరంటే ఆరు నెలల తరువాత ఏపీలో సీఎం జగన్ పాలన ఎలాంటిదో తెలుస్తుందని ఈ సందర్భంగా జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories