ఏపీ సీఎం జగన్ పై జేసీ దివాకర్‌ రెడ్డి హాట్ కామెంట్స్

ఏపీ సీఎం జగన్ పై జేసీ దివాకర్‌ రెడ్డి హాట్ కామెంట్స్
x
Highlights

జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం...

జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టుపై మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి స్పందించారు. తన సోదరుడి అరెస్టు టీవీల ద్వారానే తెలిసిందని చెప్పారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.

జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు యధావిధిగా.. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకైనా, ఎంత దాకైనా తెగిస్తుంది. జగన్ ని కంట్రోల్ లో పెట్టాలంటే నరేంద్ర మోడీ తో మాత్రమే సాధ్యం. ఏసు ప్రభు చెప్పినా జగన్ వైన్ పరిస్థితి లేదు. జెసి అష్మిత్ రెడ్డి కి ఈ వ్యవహారానికి సంబంధం లేదు. కోర్ట్ కు తప్ప ఇక తమకు వేరే మార్గం లేదు. ప్రభుత్వం లో పనిచేసే అధికారులకు నడుములు విరిగి పోయి,వారు ఏమి చేయలేక పోతున్నారు. అరెస్టు నిరసనగా ఎటువంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు. నేను నిజంగా చెబుతున్నా నాకు ఎన్ని లారీలు, ఉన్నాయో ఎన్ని బస్సులు నాకు తెలియదు. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ గవేర్నమెంట్ ఎంత దూరం అయిన తెగిస్తుంది. దీనికి రూల్స్ లేవు, రెగ్యులషన్స్ లేవు చట్టం లేదు.

రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు ఉంది ఈ పరిస్థితి. ఏమి చేసుకోలేం కోర్టు కు వెల్లవాల్సిందే. చీఫ్ సెక్రటరీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. జగన్ సర్వశక్తి సంప్పన్నడు, ఆయనే అల్లా, ఆయనే ఏసు ,ఆయనే తిరుపతి వెంక్కన. తన మాటకు ఎదురు చెప్పేవాడు, తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లు గా ఉంది జగన్ పాలన. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారి మాట చెల్లుబాట అయ్యేటట్లు లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడు. నన్ను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడు, నా ఆర్థిక మూలాలు లేకుండా చేశాడు, నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories