తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించాలి : పవన్‌కళ్యాణ్

తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించాలి : పవన్‌కళ్యాణ్
x
Highlights

కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని జనసేన పార్టీ అధినేత...

కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. పదో తరగతి రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

డిగ్రీతో పాటు ఎం.బి.ఎ., ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ., లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదని పవన్ అన్నారు. ఈ విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్ లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని తెలిపారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పవన్‌ కళ్యాణ్ కోరారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories