జేడీ రాజీనామాను ఆమోదించిన జనసేనాని

జేడీ రాజీనామాను ఆమోదించిన జనసేనాని
x
Highlights

జనసేన పార్టీకి జేడీ లక్ష్మి నారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అయన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు. అందులో జేడీ లక్ష్మీనారాయణ...

జనసేన పార్టీకి జేడీ లక్ష్మి నారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అయన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు. అందులో జేడీ లక్ష్మీనారాయణ " పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను జనసేన పార్టీ నుండి నిష్కమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్‌ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతి కార్యకర్త కి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, వారందరికీ మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. అని పేర్కొన్నారు. ఇక అయన రాజీనామాను జనసేన ఆమోదించింది. దీనికి సంబంధించిన ఓ లేఖను తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది జనసేన .

"శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నాము. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు." అంటూ పేర్కొన్నారు పవన్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories