Top
logo

బీజేపీ- జనసేన మధ్య కొనసాగుతున్న చర్చలు.. 2024 వరకు ఉమ్మడి కార్యాచరణపై సుదీర్ఘ చర్చ

బీజేపీ- జనసేన మధ్య కొనసాగుతున్న చర్చలు.. 2024 వరకు ఉమ్మడి కార్యాచరణపై సుదీర్ఘ చర్చ
X
బీజేపీ- జనసేన మధ్య కొనసాగుతున్న చర్చలు
Highlights

బీజేపీ, జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. జనసేన...

బీజేపీ, జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. జనసేన నుంచి అధినేత పవన్‌ కల్యాణ్, నాదేండ్ల మనోహర్, ఇతర నాయకులు హాజరుకాగా బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ ధియోధర్‌, జీవీఎల్, పురందేశ్వరి, సోము వీర్రాజు, మధుకర్‌తో సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. సుమారు 4 గంటల పాటు వీరి మధ్య సమావేశం కొనసాగే అవకాశం ఉంది.

రాజధాని, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే నాలుగేళ్ల పాటు రెండు పార్టీలు కలిసిపనిచేసే అవకాశం ఉన్నట్లు రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు. తమ మధ్య అవగాహన కొద్ది రోజులకు లేదా కొన్ని అంశాలకు పరిమితం కాదని సుదీర్ఘ ప్రయాణం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. అంతకుముందు జనసేనతో ఏఏ అంశాలపై చర్చించాలన్న దానిపై బీజేపీ నేతలు సమావేశం అయ్యారు.

Web TitleJana Sena-BJP meeting ongoing
Next Story