చంద్రబాబు హయాంలో ఐదు శాతం రుణాలిచ్చి..గొప్పగా చేశామంటున్నారు: సీఎం జగన్‌

చంద్రబాబు హయాంలో ఐదు శాతం రుణాలిచ్చి..గొప్పగా చేశామంటున్నారు: సీఎం జగన్‌
x
Highlights

ఐదు శాతం రుణాలిచ్చి రైతులకు వడ్డీలేని రుణాలిచ్చినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వడ్డీలేని రుణాలపై నిన్నటి చర్చను...

ఐదు శాతం రుణాలిచ్చి రైతులకు వడ్డీలేని రుణాలిచ్చినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వడ్డీలేని రుణాలపై నిన్నటి చర్చను కొనసాగించిన సీఎం జగన్ ఐదేళ్ల చంద్రబాబు హయాంలో వడ్డీలేని రుణాలపై ఆధారాలతో సహా లెక్కలు చెప్పారు. 2014-15లో 1186 కోట్లు కట్టాల్సి ఉంటే 44.31 కోట్లు చెల్లించి గొప్పగా చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2015-16లో 2238 కోట్లు కట్టాల్సి ఉంటే 31 కోట్లు చెల్లించారని 2016-17లో 2354 కోట్లు కట్టాల్సి ఉంటే 249 కోట్లు, 2017-18లో 2703 కోట్లు కట్టాల్సి ఉంటే 182 కోట్లు చెల్లించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. 2018-19లో 3069 కట్టాల్సి ఉంటే 122 కోట్లు చెల్లించారని తెలిపారు. ఐదేళ్లలో 11,595 కోట్లు కట్టాల్సి ఉంటే కేవలం 630 కోట్లు చెల్లించి గొప్పగా చేశామంటున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories