logo

మొహమాటం లేదు.. బాబాయ్ అయినా కుదరదు..

మొహమాటం లేదు.. బాబాయ్ అయినా కుదరదు..
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.. ఈ ఎన్నికల్లో గెలుపొందే...

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.. ఈ ఎన్నికల్లో గెలుపొందే నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో బంధాలు, బంధుత్వాలు అని పక్కనబెట్టేశారు.. వంగవీటి రాధా వంటి నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా లెక్కచేయలేదు.. మొన్నటిదాకా కడప జిల్లా రాజంపేట టిక్కెట్ మాజీ అమరనాధ్ రెడ్డికే అని అందరూ భావించారు.. కానీ ఇటీవల టీడీపీనుంచి వైసీపీలోకి వచ్చిన మేడా మల్లికార్జునరెడ్డికి కన్ఫామ్ చేశారు. అలాగే వైయస్ కుటుంబానికి వీర విధేయత ప్రదర్శించే గౌరు కుటుంబానికి ఈసారి పాణ్యం టిక్కెట్ ఇవ్వనని జగన్ తేల్చేశారు.. టిక్కెట్ విషయంలో విభేదించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.. వైసీపీకి రాజీనామా చేసినా పట్టించుకోలేదు..

చీరాలలో గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ను వైసీపీలో చేర్చుకుని ఆయనకే టిక్కెట్ కన్ఫామ్ చేశారు జగన్. ఈ విషయంలో ప్రస్తుత ఇంచార్జ్ యడం బాలాజీ హెచ్చరికల్ని సైతం పక్కబెట్టేశారు. ఇక ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఆయనకు టిక్కెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు. దీంతో సుబ్బారెడ్డి.. మొన్న అమరావతిలో జరిగిన జగన్ గృహప్రవేశ కార్యక్రమానికి రాలేదు. సుబారెడ్డికి టిక్కెట్ నిరాకరణ విషయంలో జగన్ కుటుంబసభ్యులు చెప్పినా కేర్ చెయ్యలేదని తెలుస్తోంది. ఇక రాజకీయాలకు ఆయువుపట్టు అయిన విజయవాడలో కూడా జగన్ సంచలన నిర్ణయాలే తీసుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఆశించిన వంగవీటి రాధా కు మొండిచెయ్యి చూపారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీటు కేటాయించారు. దాంతో రాధా వైసీపీకి రాజీనామా చేశారు. ఇలా చాలా చోట్ల సన్నిహితులు బంధువులకు సైతం జగన్ సీటు నిరాకరించారు.

లైవ్ టీవి

Share it
Top