అక్రమ కట్టడాలు తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా?: సీఎం జగన్

అక్రమ కట్టడాలు తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా?: సీఎం జగన్
x
Highlights

అక్రమ కట్టడాలపై శాసనసభలో మినీ యుద్ధమే జరిగింది. అధికార ప్రతిపక్షనేతలనేతలవాగ్వివాదంతో దద్దరిల్లింది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రజల్లో అనుమానం...

అక్రమ కట్టడాలపై శాసనసభలో మినీ యుద్ధమే జరిగింది. అధికార ప్రతిపక్షనేతలనేతలవాగ్వివాదంతో దద్దరిల్లింది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రజల్లో అనుమానం పెరిగిందని అక్రమ కట్టడాలపై ప్రభుత్వ విధానమేంటని సభ్యుడు నిమ్మలరామానాయుడు వేసిన ప్రశ్నలకు అధికార పార్టీనేతలు ధీటైన సమాధానాలు ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించి కట్టిన భవనాన్ని కూల్చేస్తే ప్రశ్నిస్తున్నారని అధికారపార్టీనేతలు మండిపడ్డారు. ప్రజావేదిక నిర్మాణంలో అప్పటి సిఎం చంద్రబాబు రూల్స్‌ పాటించలేదని ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే మిగిలినవారు పాటిస్తారా? అని ప్రశ్నించారు.

నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంవల్ల ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు నీట మునుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అక్రమ కట్టడాలు తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరద ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రజావేదిక నిర్మించారు. నదీపరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అక్రమ కట్టడాలతో వరద ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. దానివల్లే వరద ముప్పు పెరుగుతోంది. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల వల్ల తీవ్రనష్టం వాటిల్లుతోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories