బీసీలకు 7 ... ఎస్సీలకు 5

బీసీలకు 7 ... ఎస్సీలకు 5
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ కూర్పు పూర్తయింది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు చోటుకల్పించారు. 25 మంది సభ్యుల...

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ కూర్పు పూర్తయింది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు చోటుకల్పించారు. 25 మంది సభ్యుల కేబినెట్‌లో బీసీలు అధికంగా ఉన్నారు. నలుగురు సభ్యుల చొప్పున రెడ్డిలు, కాపులకు అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించారు. ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య, మైనార్టీకి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో అత్యధికంగా ఏడుగురు బీసీలకు, ఆ తర్వాత ఐదుగురు ఎస్సీలకు జగన్ అవకాశం కల్పించారు. చెరో నలుగురు సభ్యుల చొప్పున రెడ్డిలు, కాపులకు సమాన ప్రాధాన్యత కల్పించారు. వివిధ వర్గాలకు ఒకరి చొప్పున సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తున్నట్టు జగన్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ సారి మంత్రివర్గంలో స్థానం కల్పించని ఎమ్మెల్యేలకు రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రివర్గం మార్పులో అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ స్సీకర్ బీసీ , డిప్యూటీ స్పీకర్ బ్రాహ్మణ వర్గానికి సీఎం జగన్ కేటాయించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories