బ్రహ్మంగారు రాసింది నిజమేనా.. అసలు వీరబ్రహ్మం రాసిన కాలజ్ఞానంలో ఏముంది

బ్రహ్మంగారు రాసింది నిజమేనా.. అసలు వీరబ్రహ్మం రాసిన కాలజ్ఞానంలో ఏముంది
x
Highlights

కరోనా వైరస్ కల్లోలానికి గ్లోబల్ మొత్తం చిగురాటాకుల వణికిపోతుంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచం భయాందోళకు గురి అవుతుంది. అయితే దేశానికి ఉత్తర ఈశాన్యంలో ఈ...

కరోనా వైరస్ కల్లోలానికి గ్లోబల్ మొత్తం చిగురాటాకుల వణికిపోతుంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచం భయాందోళకు గురి అవుతుంది. అయితే దేశానికి ఉత్తర ఈశాన్యంలో ఈ విష వైరస్ పుట్టి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని నాలుగు వందల సంవత్సరాల క్రితం రాసింది నిజమేనా..? పోతులూరి వీరబ్రహ్మంగారు నాలుగు శతాబ్దాల క్రితమే రాశారన్న వార్తాలతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే అసలు వీరబ్రహ్మం రాసిన కాలజ్ఞానంలో ఏముంది.

ఈ శాన్య దిక్కున విష గాలి పుట్టేను

లక్షలాది ప్రజలు సచ్చేరయ..

కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి

కోడిలాగా తూడి సచ్చేరయ

అంటూ నాలుగు వందల సంవత్సరాల క్రితం వీరబ్రహ్మం రాసిన కోరంకి నేటి కరోనా ఒక్కటే అని రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

కరోనా ప్రపంచాన్ని చిగురుటాకుగా వణికిస్తున్నా మహమ్మారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కేంద్రం కరోనాపై యుద్ధం ప్రకటించింది అయితే ఈ మాయరోగం గురించి నాలుగు వందల సంవత్సరాల క్రితమే పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు అయితే ఇప్పుడు ఇదే ప్రస్తుతం హాట్ చర్చకు దారీ తీసింది.

కరోనా వైరస్ గురించి విదేశాలకు చెందిన వారు చాలా మంది చాలా రకాలుగా రాశారు. పదేళ్ల క్రితం ఒకరు 20ఏళ్ల క్రితం ఒకరు కరోనా వైరస్ గురించి రాశారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. అయితే అంతకు ముందు నాలుగు వందల సంవత్సరాల క్రితమే కర్నూలు జిల్లాలో బనగానపల్లెలో పుట్టిన వీరబ్రహ్మం ప్రస్తవించారు ఆ విషపుగాలి ఉపఖండానికి ఈశాన్య దిక్కు నుంచి పుట్టి వేలాది మంది జనుల ప్రాణాలు హరిస్తుందని చెప్పారు. కలియుగాంతం వరకు ఆయన చెప్పిన భవిష్యత్ కాలజ్ఞానం ప్రతి అంశంలోనూ రుజువవుతూ వస్తోంది.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో భూలోకంలో సంభవించే అనేక పరిణామాల గురించి ముందే ఊహించి తాళపత్రాలపై వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రచించారు కాలజ్ఞానంలో ఉన్న చాలా విషయాలు ఇప్పటికే నిజం అయ్యాయి. ఆయన రచించిన కాలజ్ఞానంలో పొందుపరిచిన అంశాల్లో నేడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కూడా ఉంది.

కాలజ్ఞానంలో కరోనా గురించి స్పష్టంగా చెప్పారని తెలుసుకోవడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లె ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఆయన కాలజ్ఞానంలో పొందుపరిచిన కొరంకినే కరోనా రూపంలో విషపుగాలిలా పుట్టి వేలాది మంది ప్రాణాలు బలిగొంది దీంతో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు పర్యాటకులు. కాలజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో రాబోయే విపత్తులను ఆపగలమో లేదో తెలియదు గానీ ఇలాంటి మహానీయులు నడయాడిన నేల కాబట్టే మా భారతావని పుణ్యభూమి, కర్మభూమి అయ్యిందని ఎలుగెత్తే అవకాశం మాత్రం లభిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories