Top
logo

చిత్తూరు జిల్లా పలమనేరులో ఐటీ దాడులు

చిత్తూరు జిల్లా పలమనేరులో ఐటీ దాడులు
Highlights

పలమనేరు ఉలిక్కి పడింది. ఎప్పుడైనా పోలీసుల హడావుడీ తప్ప పెద్దగా ప్రభావం కనిపించని ఈ పట్టణంలో ఐటి శాఖ అధికారులు పలు చోట్ల సోదాలు చేయడంతో హడలిపోయారు.

పలమనేరు ఉలిక్కి పడింది. ఎప్పుడైనా పోలీసుల హడావుడీ తప్ప పెద్దగా ప్రభావం కనిపించని ఈ పట్టణంలో ఐటి శాఖ అధికారులు పలు చోట్ల సోదాలు చేయడంతో హడలిపోయారు. పలమనేరు లో ఐ.టి.శాఖ అధికారులు ఏకకాలంలో పలువురి ఇళ్ళు, కార్యాలయాలపై సోదాలు చేశారు. SKS ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని జాఫర్ కార్యాలయం, ఇంటిలోను ఇవాళ ఉదయం నుండి సోదాలు జరుగుతున్నాయి. కీలకమైన పత్రాలు అధికారులు పరిశీలిస్తున్నారు.

అలాగే పలమనేరులో పేరుమోసిన పిల్లల డాక్టర్ షాహిద్ ఇల్లు, హాస్పిటల్ పైన ఏకకాలంలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. డాక్టర్‌ పన్నులు ఎగగొడుతున్నాడనే కంప్లైంట్ రావడంతో ఆయనపై ఐటి శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. ఎస్కెఎస్ యజమాని జాఫర్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా కొనసాగాడు.

తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరాడు. ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ కు సన్నిహితంగా ఉన్నారు. అంతే కాకుండా గత కొంతకాలంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్దరికి సంబంధించి పట్టణంలో పలు ఆస్తులు ఉండడంతో ఐటి శాఖ అధికారులు అన్ని చోట్లా సోదాలు జరుపుతున్నారు.Web TitleIncome tax raids in Chittoor District
Next Story