పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదు : స్పీకర్‌ తమ్మినేని సీతారాం

తమ్మినేని సీతారాం
x
తమ్మినేని సీతారాం
Highlights

అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో నిర్వహించిన ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...

అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీలో నిర్వహించిన ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు. ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరాలంటే రాజీనామా చేయాలని తెలిపారు.

ఒక వేళ రాజీనామా చేయకుండా ఇతర పార్టీ తీర్థం పుచ్చుకుంటే వారిపై అనర్హత వేటు పడుతుందని ఆయన స్పష్టం చేశారు. 'సభా నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చారని ఆయన తెలిపారు. అనంతరం చట్టసభల కార్యకలాపాలను డిజిటల్‌ రూపంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. డిసెంబర్ 17 నుంచి 21వరకు డెహ్రాడూన్లో స్పీకర్ల సదస్సు జరగనుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా స్పీకర్‌ తెలిపారు. ఈ సమావేశం 10 రోజుల నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories