ఎమ్మెల్యే పయ్యావుల స్వగ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీని విభజించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ

ఎమ్మెల్యే పయ్యావుల స్వగ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీని విభజించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ
x
కౌకుంట్లలో ఉద్రిక్తత
Highlights

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్లలో ఉద్రిక్తత నెలకొంది. కౌకుంట్ల పంచాయతీని రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రామంలో...

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్లలో ఉద్రిక్తత నెలకొంది. కౌకుంట్ల పంచాయతీని రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పంచాయతీని రెండుగా విభజించాలని ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ ఒకటే ఉండాలంటూ గతంలో గ్రామస్తులు తీర్మానం చేశారు. కౌకుంట్ల పంచాయతీ పరిధిలో చిన్న కౌకుంట్ల, పెద్దకౌకుంట్ల, వై రామపురం, రాసిపల్లి, మైలారం గ్రామాలున్నాయి. అయితే వై.రామపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. కోర్టులో కేసు ఉన్నందున గ్రామ సభ నిర్వహించరాదని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

కౌకుంట్లలో గ్రామసభ కొనసాగుతోంది. ఆధార్‌కార్డు ఆధారంగా సభలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సహా గ్రామ సభకు స్థానికులు తరలివస్తున్నారు. అడిషనల్‌ ఎస్పీ రామాంజనేయులు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారి వెంకటనాయుడు ఆధ్వర్యంలో సభ కొనసాగుతోంది.Show Full Article
Print Article
More On
Next Story
More Stories