తిరుమలలో వీఐపీ దర్శనాలపై హైకోర్ట్ ఆగ్రహం

తిరుమలలో వీఐపీ దర్శనాలపై హైకోర్ట్ ఆగ్రహం
x
Highlights

టీటీడీ లో అమలవుతున్న వీఐపీ బ్రేక్ దర్శనాల కేసు పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా L1, L2, L3 దర్శనాలు పై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ ను ...

టీటీడీ లో అమలవుతున్న వీఐపీ బ్రేక్ దర్శనాల కేసు పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా L1, L2, L3 దర్శనాలు పై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ ను హైకోర్టు వివరణ కోరింది. కౌంటర్ లో L1, L2, L3 దర్శనాలు పై వివరణ ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని ఇప్పటికే చైర్మన్ ప్రకటన చేశారని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై పిటిషనేట్ తరపు అడ్వాకెట్ టీటీడీ బోర్డు ఇంకా ఏర్పాటు కాలేదని, చైర్మన్ నిర్ణయం ఒక్కటే చట్టప్రకారం చెల్లదని తన వాదనలు వినిపించారు. కోర్టుకూడా చైర్మన్ ప్రకటనను లెక్కలోకి తీసుకోలేమని చెప్పింది. రద్దు చేస్తున్నట్టు జీవో, లేదా ఆర్డర్ ఉంటె కోర్టు ముందు పెట్టాలని ఈ సందర్బంగా సూచించింది. L1, L2, L3 దర్శనాలు రద్దు చేసి వాటికే పేర్లు మార్చి ప్రోటోకాల్ దర్శనాలు అని కొత్త విధానాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సందర్బంగా పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ దర్శనాలు పూర్తిగా తొలగించాలని కోర్టును ఆయన కోరారు. కొత్తగా ఏర్పాటు అయ్యే బోర్డ్ లో కూడా వీటి ప్రతిపాదన లేకుండా చూడాలని కోరారు. వీఐఈ దర్శనాలను కంటి తుడుపు చర్య గా కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.పిటిషనర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కు ఆదేశాలు జారీ చేసింది. తరువాతి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ అంశంలో గురువారం వాదనలు తరువాత తీర్పు వెల్లడించే అవకాశం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories