పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనాన్ని స్థంబింప చేసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పాలకొల్లులో ప్రైమరీ...

పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనాన్ని స్థంబింప చేసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పాలకొల్లులో ప్రైమరీ పాఠశాలోకి భారీ నీరు వచ్చి చేరడంతో రోడ్డుపైనే విద్యార్ధులకు పాఠాలు భోదించారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఓ ఇంటిగోడ కూలిపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

పాలకొల్లులో కురిసిన భారీ వర్షం విద్యార్ధుల చదువులకు ఆటంకం కల్గించింది. స్కూల్ ఆవరణతో పాటు తరగతి గదులన్నీ వాన నీరు నిలిచిపోయాయి. పాఠశాలకు వచ్చిన విద్యార్ధులు రోడ్డుపైనే ఉండిపోయారు. వాన రావడంతో పిల్లలను ఇంటికి వెళ్లాలని ఊపాధ్యాయులు సూచించినా రోడ్డుపైనే కూర్చొని పాఠాలు చెప్పాలంటూ మొండికేశారు. చేసేది లేక రోడ్డుపైనే పాఠాలు భోదించారు ఉపాధ్యాయులు. మధ్యాహ్న భోజనం కూడా రోడ్డుపైనే ఏర్పాటు చేశారు.

గతంలోనూ ఆరు లక్షలు ఖర్చు చేసి పాఠశాల మరమ్మత్తులు చేశారు. అయినా వర్షం వచ్చినప్పుడల్లా స్కూల్లోకి వాన నీరు వచ్చి చేరుతుంది. మరో వైపు ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీఠ వేస్తున్నామని పదే పదే చెబుతున్నా పాలకొల్లులోని ప్రైమరీ పాఠశాల దుస్థిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో వర్షానికి బాగా తడిసిన ఇంటిగోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీంతో విషాదచా‍యలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories