తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
x
Highlights

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో...

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి మొదలైన వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్‌లో కూడా రాత్రంతా వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇటు రోడ్లపై వరదనీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. 15 రోజులుగా జాడలేని వర్షాలు ఒక్కసారిగా పడటంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పంటలకు ప్రాణం పోసినట్లే అని సంబర పడిపోతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత మొదలైన వాన తెల్లవారుజాము వరకు కురిసింది. భారీ వర్షంతో.. వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎప్పట్లాగే ట్రాఫిక్‌ గంటల కొద్దీ జామ్‌ అయ్యింది. గంటల కొద్దీ వాహనాలు ముందుకు కదల్లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడళ్లలో చాలా చోట్ల భారీగా వరద నీరు నిలిచిపోయింది. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లాయి.

అయితే వరద ప్రభావం ఉన్న 35 చోట్ల 13 డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరదనీటి మళ్లింపుపై ప్రత్యేక దృష్టి సారించాయి. మ్యాన్‌హోల్స్‌ తెరిచి వరదనీటిని మళ్లించారు. ఇటు తెరుచుకున్న మ్యాన్‌హోల్స్‌ దగ్గర జీహెచ్‌ఎంసీ సిబ్బంది కాపలా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories