కర్నూలు జిల్లా ఆలూరులో తెగిన కల్వర్టు.. రాకపోకలు బంద్

కర్నూలు జిల్లా ఆలూరులో తెగిన కల్వర్టు.. రాకపోకలు బంద్
x
Highlights

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. బళ్లారి టు కర్నూలు వెళ్లే దారిలో ఉన్న...

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. బళ్లారి టు కర్నూలు వెళ్లే దారిలో ఉన్న కురువళ్లి చెరువుకు గండి పడింది. ఉధృతంగా పారుతున్న వర్షపు నీటిలో చెరువు పొంగిపొర్లడంతో కల్వర్టు తెగిపోవడంతో జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కురువళ్లి చెరువు నుంచి ఒక్కసారిగా వచ్చిన వర్షపునీటికి తట్టుకోలేక కల్వర్టు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుంతకల్లు, ఆలూరు,ఆదోని, మంత్రాలయం, బళ్లారి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. వరదనీటి ప్రవహనికిఇటు జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చంటి పిల్లతోరోడ్లపైనే ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories