Top
logo

విశాఖలో మాజీ ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత

విశాఖలో మాజీ ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత
X
Highlights

నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారంటూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ చెందిన భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

విశాఖపట్నంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారంటూ విశాఖకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ కి చెందిన భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విశాఖనిలో ద్వారకానగర్ మెయిన్‌ రోడ్డులో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకున్నారు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్. అయితే నిబంధనలు ఉల్లంఘించి మురికి కాలువను ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారని జీవీఎంసీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు పీలాగోవింద్ పలుమార్లు దీనిపై స్పందన కోరుతూ నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, దీంతో ఈ ఉదయం రంగంలోకి దిగిన జీవీఎంసీ సిబ్బంది.. అధికారుల సమక్షంలో కూల్చివేత మొదలుపెట్టారు. కూల్చివేతతో ద్వారకానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసుల మోహరించారు.
Next Story