మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ దిమ్మె కూల్చివేత
x
Highlights

దివంగత నేత, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన దిమ్మెను అధికారులు కూల్చివేశారు. గుంటూరు...

దివంగత నేత, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన దిమ్మెను అధికారులు కూల్చివేశారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించాలనుకున్నారు. దీనికోసం టీడీపీ శ్రేణులు ఆ ప్రాంతలో దిమ్మెను ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయమై అర్థరాత్రి లింగరావుపాలెంలో టెన్షన్ నెలకొంది. ఇవాళ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు షాకిచ్చారు. విగ్రహ దిమ్మెను ధ్వంసం చేశారు. వారం క్రితమే విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి కోరామని అయినా అధికారులు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నామని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. కాగా అధికారుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది పాలకేంద్రం సెంటర్ వద్ద విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేవని ఒకవేళ ఉంటే తమకేమి అభ్యంతరం లేదని చెప్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు విగ్రహ దిమ్మెను కూల్చివేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories