గుంటూరులో పెరుగుతున్న కేసులు.. కలెక్టర్ శ్యామల్ కీలక నిర్ణయం

గుంటూరులో పెరుగుతున్న కేసులు.. కలెక్టర్ శ్యామల్ కీలక నిర్ణయం
x
Representational Image
Highlights

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే..

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఇవ్వాళ కొత్తగా 82 కొత్తపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 970 ఆక్టివ్ కేసులు ఉన్న్నాయి. ఇక కరోనాతో పోరాడి ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. రాష్ట్రంలో258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక రాష్ట్రంలోని అత్యధికంగా కర్నూల్ జిల్లాలో కేసులు నమోదు అయ్యాయి. అక్కడ 332 కేసులు నమోదు కాగా, 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. తొమ్మిది మంది మృతి చెందారు. ఇక కర్నూల్ తరవాత గుంటూరులో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ 254 కేసులు నమోదు కాగా, 207 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఎనమిది మంది మృతి చెందారు. అయితే గుంటూరులో రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండడంతో జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గుంటూరులోని నరసరావుపేటలో సైతం భారీగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. బుధ, గురువారాల్లో ఎవరూ బయటకు రావొద్దని, చర్యలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ శామ్యూల్‌ ఆనందకుమార్‌ మంగళవారం తెలిపారు. అంతేకాకుండా కొంత మంది ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కలెక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. ఇక లాక్ డౌన్ కచ్చితంగా పాటించాలని లేనిచో జైలుకు పంపుతామని వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories