Rayanapadu: పట్టాలు తప్పిన రైలు.. రాయనపాడు స్టేషన్ సమీపంలో ఘటన

Rayanapadu: పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

Jyothi
Published on: 23 Feb 2024 10:20 AM IST
Goods Train Derailed in Rayanapadu
X

Rayanapadu: పట్టాలు తప్పిన రైలు.. రాయనపాడు స్టేషన్ సమీపంలో ఘటన

Rayanapadu: ఎన్టీఆర్ జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వెళుతున్న గూడ్స్ రైలు రాయణపాడు స్టేషన్ దాటగానే పట్టాలు తప్పింది. నాలుగు వాగన్లు ట్రాక్ పైకి వోరిగిపోయాయి. విషయం తెలుసుకున్న విజయవాడ డివిజన్ రైల్వే ఇంజనీరింగ్ అధికారులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు.

గ్రానైట్ స్టోన్స్ తో కరీంనగర్ నుంచి కాకినాడపోర్టుకు వెళ్తున్న గూడ్స్ రైలు రాత్రి 9 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు స్టేషన్ దాటగానే పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ, హైదరాబాద రూట్లో పలు రైళ్లను దారి మళ్లించారు. మచిలీపట్నం బీదర్ , కాకినాడ పోర్టు లింగంపల్లి , గూడూరు సికింద్రాబాద్ రైళ్లను గుంటూరు మీదుగా సికింద్రాబాద్ తరలిస్తున్నారు రైల్వే అధికారులు.

Jyothi

Jyothi

Next Story