Top
logo

ధవళేశ్వరం బ్యారేజ్‌లో వరద ఉధృతి

ధవళేశ్వరం బ్యారేజ్‌లో వరద ఉధృతి
X
Highlights

తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవహం పొట్టెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్...

తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవహం పొట్టెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13. 20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. మొదటి వరద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ధవలేశ్వరం బ్యారేజ్ లోని వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండడంతో కోనసీమలోని వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమి ఉప నదులు పొంగిపొర్లుతున్నాయి. దేవిపట్నం మండలంలో 36 ముంపు గ్రామాలకు బాహ్యా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 8 రోజులుగా దేవీపట్నం పాటు పలు గ్రామాలు వరద నీటితో కొట్టుమిట్టాడుతున్నాయి. దాదాపు 198 గ్రామాలపై వరద ప్రభావం ఉంది. కాజ్ వేలపై నుంచి వరద నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి.

మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశదార నదులు ఉప్పొంగుతున్నాయి. గొట్టా బ్యారేజ్, తోటపల్లి రిజర్వాయర్ లోకి వరద ఉధృతి పెరుగుతోంది. నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Next Story