కూతురు మాట వినుంటే..బతికేవాళ్లు...

కూతురు మాట వినుంటే..బతికేవాళ్లు...
x
Highlights

ఆ పాప గోదావరికి బదులు జూపార్క్ కు వెళ్తాను అని చెప్పింది. కానీ తల్లిదండ్రులు కూతురి మాట వినలేదు. మరీ నచ్చజెప్పి కూతుర్ని గోదావరికి తీసుకెళ్లారు....

ఆ పాప గోదావరికి బదులు జూపార్క్ కు వెళ్తాను అని చెప్పింది. కానీ తల్లిదండ్రులు కూతురి మాట వినలేదు. మరీ నచ్చజెప్పి కూతుర్ని గోదావరికి తీసుకెళ్లారు. గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో ఆ చిన్నారి మృతి చెందగా, తండ్రి గల్లంతయ్యారు. ఇది తిరుపతికి చెందిన బాలిక హాసిని విషాదగాథ.

తల్లిదండ్రుల మధ్య ఈ ఫోటోలో ఉన్న ఈ పాప పేరు హాసిని. తిరుపతికి చెందిన వ్యాపారి సుబ్రహ్మణ్యం, మధులత దంపతుల ముద్దుల కూతురు. స్ప్రింగ్ డేల్ స్కూల్ లో హాసిని ఏడో తరగతి చదువుతుంది. సుబ్రహ్మణ్యం తండ్రి గంగిశెట్టి 3 నెలల క్రితం మృతిచెందారు. తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు సుబ్రహ్మణ్యం ప్లాన్ వేశారు. అయితే అక్కడికి ఒద్దమ్మా నేను రాను అంటూ హాసిని మొండికేసింది. 14వ తేదిన హాసిని చదువుతున్న పాఠశాలవారు పిల్లలను తిరుపతి జూపార్క్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. తోటి విద్యార్థులతో కలిసి జూ పార్క్‌కు వెళ్తానని హాసిని చెప్పింది. అమ్మనాన్న మరీ నచ్చజెప్పి హాసినిని గోదావరికి తీసుకెళ్లారు.

శుక్రవారం తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం కుటుంబం కూతురు హాసినితో కలిసి రాజమండ్రికి వచ్చారు. తండ్రి అస్థికలను గోదావరిలో కలిపేందుకు కూతురు, భార్యతో కలిసి సుబ్రహ్మణ్యం లాంచీ ఎక్కారు. కుచ్చులూరు వద్ద బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతు కాగా, మధులత ప్రాణాలతో బయటపడ్డారు.

నేనేం ద్రోహం చేశాను దేవుడా చివరకు నా పాపనుకూడా లేకుండా చేశావ్‌ అంటూ మధులత ఘటనా స్థలంలో రోదించడాన్ని టీవీల్లో చూసిన బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. గోదావరి గల్లంతైన హాసిని మృతదేహాన్ని ఎన్డీఆర్ ఎఫ్ దళాలు వెలికితీశాయి. పోస్టుమార్టమ్ కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. తాత ఆస్థికలను గోదావరిలో కలిపేందుకు వచ్చి హాసిని కనిపించని తీరాలకు వెళ్లిపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories