గోదావరిలో కొనసాగుతోన్న ఆపరేషన్‌..సోనార్ పరికరంతో బోటును గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్‌

గోదావరిలో కొనసాగుతోన్న ఆపరేషన్‌..సోనార్ పరికరంతో బోటును గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్‌
x
Highlights

గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 34...

గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 34 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించారు. అయితే, ఉత్తరాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సోనార్ పరికరంతో 250 అడుగుల లోతులో బోటును గుర్తించారు.

మునిగిపోయిన బోటులో మొత్తం 78మంది ఉండగా, అందులో 65మంది పర్యాటకులు, 8మంది బోటు సిబ్బంది ఉన్నారు. అయితే, 26మంది ప్రాణాలతో బయటపడగా, మొత్తం 52మంది గల్లంతయ్యారు. అయితే, ఇప్పటివరకు 34 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 18మంది ఆచూకీ లభించాల్సి ఉంది. అయితే, వీళ్లంతా బోటులో ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే మృతదేహాలు బయటపడే అవకాశముందంటున్నారు.

అయితే, లోతైన నదీగర్భంలో బోటు మునిగిపోవడంతో బయటికి తీయడం కష్టమేనంటున్నారు అధికారులు. బోటు బరువు అధికంగా ఉండటం, 250 అడుగుల లోతులోకి కూరుకుపోవడంతో బయటికి తీయడం సాధ్యం కాదంటున్నారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి బోటును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు ఏపీ డీజీపీ. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్‌ బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories