బోటు యజమానిపై గతంలోనూ కేసులు

బోటు యజమానిపై గతంలోనూ కేసులు
x
Highlights

గోదావరిలో పడప ప్రమాదం ఎన్నో కుటంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే, ఒకవైపు గల్లంతైన వారి కోసం గాలిపుం మరోవైపు, ఈ పడవ యజమాని కోసం సెర్చ్ జరుగుతోంది....

గోదావరిలో పడప ప్రమాదం ఎన్నో కుటంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే, ఒకవైపు గల్లంతైన వారి కోసం గాలిపుం మరోవైపు, ఈ పడవ యజమాని కోసం సెర్చ్ జరుగుతోంది. ఇంతలో రాయల్‌ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది.

విశాఖ జిల్లా సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో కోడిగుడ్ల వెంకటరమణ నిందితుడిగా ఉన్నాడు. సరిపల్లి గ్రామంలో సర్వే నెంబరు 148/15లో 400 గజాల స్థలంపై తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే స్థలాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన ఘటనపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.

మరోవైపు బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై 2009లో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో కొట్లాట కేసు నమోదయ్యింది. గ్రామంలో సర్వే నెంబర్‌ 267లోని ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారన్న ఆరోపణలపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా మరో కేసులో ఇదే పోలీస్‌స్టేషన్‌లో వెంకటరమణతో పాటు మరి కొందరిపై బైండోవర్‌ నమోదుచేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories