ఏపీలో స్మార్ట్ సిటీలకు రూ.1174 కోట్లు: కేంద్ర మంత్రి

ఏపీలో స్మార్ట్ సిటీలకు రూ.1174 కోట్లు: కేంద్ర మంత్రి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ సిటీస్ కోసం రూ.1174 కోట్లు కేంద్రం విడుదల చేసింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర...

ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ సిటీస్ కోసం రూ.1174 కోట్లు కేంద్రం విడుదల చేసింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలిపారు. అమరావతికి రూ.390 కోట్లు, కాకినాడకు రూ.294 కోట్లు, తిరుపతికి రూ.196 కోట్లు, విశాఖపట్నానికి రూ.294 కోట్లు విడుదల చేశామని సమాధానమిచ్చారు. అదేవిధంగా అమృత్ పథకం పై రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ లో 33 పట్టణాల్లో అమృత్ ను అమలు చేస్తున్నామన్నారు. రూ.2,890.17 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించామని తెలిపారు. ఇందులో కేంద్ర వాటా రూ.1,056.62 కోట్లని తెలిపారు. ఇంకా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ చెన్నై, కోల్‌కతా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున అక్కడ కొత్త ఎయిర్‌పోర్టులు కొత్త

వి నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి విజయవాడ, హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, పుణే, వారణాసి, బెంగళూరు, కొచ్చిన్‌, ముంబాయి, దిల్లీ ఎయిర్‌పోర్టుల నుంచి విమాన ప్రయాణికులకు డిజీయాత్ర అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్రమంత్రి పూరీ తెలిపారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ప్రతి గేటు దగ్గర టికెట్‌, గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా నేరుగా విమానం వద్దకు చేరుకొనే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories